ధనుస్సు రాశి
మూల – ఒకటి,రెండు,మూడు,నాలుగు పాదములు.
పూర్వాషాడ – ఒకటి,రెండు,మూడు,నాలుగు పాదములు.
ఉత్తరాషాడ-ఒకటవ పాదం.
ఆదాయం – 5 వ్యయం – 14
రాజపూజ్యం – 4 అవమానం- 2
ఈ రాశి వార్కి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు యేర్పడును.ఆదాయ మార్గాలు సెప్టెంబర్ ఒకటి వరకు బాగుండును.ఆ తదుపరి ధన లాభాలు కొద్దిగా తగ్గును.ఉద్యోగ,వ్యాపార ప్రయత్నాలు ఈ సంవత్సరం మధ్య వరకు బాగుండును.నూతన గృహ ఆలోచన కార్య రూపం దాల్చును.భూ సంబందమైన వ్యవహారాలు లాభం చేకుర్చును.గృహం లో వివాహాది కార్యక్రమములు జరుగును.సంతానం మంచి స్థితి లో వుండును.విష క్రిములు,సర్ప సంబంధమైన సమస్యలు కలుగును.దూర ప్రమ్తమిలో ధన వ్యయం,ధన నష్టం,ఆరోగ్య సమస్యలు,అధిక ధన వ్యయం,జీవిత భాగస్వామి విషయంలో మిశ్రమ ఫలితాలు.ఉద్యోగం లో శ్రమ,నష్టం.తల్లిదండ్రులకు సంబందించిన స్థిరాస్తి ప్రాప్తి.కోర్ట్ తగాదాలు,పోలీసు సమస్యలు.ధన సంబంధమైన ఋణాలు.
ఏప్రిల్:- ఈ నెల యందు చేయు వ్రుత్తి వ్యాపారములయందు రాణించును.ఆరోగ్య లాభం,వ్యవహార జయం,కుటుంబ సంతోషములు,గృహ నిర్మాణం లో పనులు కలసివచును.గృహం లో సుభాకర్యములు చేయుట,నూతన వస్తు,వస్త్ర ప్రాప్తి,స్పెక్యూలేషన్ రాణించును.
మే:- ఈ నెలలో అన్నిరంగాముల వారికీ అనుకూలం.ధైర్యముగా ముందుకి పోగలరు.ఉల్లాసం గా ఉత్సాహం గా కర్యములుచేస్తారు.ఆర్దికలావాదేవీలు అనుకూలం,సోదర సహకారం,నూతన వాహన ప్రాప్తి.ఉద్యోగులకు గృహ మార్పులు తప్పవు.సంఘంలో కీర్తి వృద్ది.ఇతరుల విషయం లో సహాయసహకారాలు అందిస్తారు.
జూన్:- ఈ నెల గ్రహములు అనుకులసంచారం వలన అన్నింటా జయం.కుటుంబ వృద్ది,మనోల్లాసం,ప్రశాంత జీవనం,సాఫీగా హాయిగా వుంటుంది.ధన లాభం,బంధుమిత్ర సౌఖ్యం,ఖరీదైన వాహనంలో సంచరించుట,రాజకీయ నాయకులతో,సంఘ పెద్దలతో కలయిక,స్పెక్యూలేషన్ లాభములు,నూతన పరిచయ లాభం.
జూలై:- ఈ నెలయందు మిశ్రమ ఫలితాలు.కొన్నిటియందు లాభించి కొన్నిటియందు నష్టపరచును.ఆరోగ్యం బాగుంటుంది.ఆదాయమునకు మించిన ఖర్చులు.సోదర విరోధములు.భార్యతో చిన్న చిన్న వివాదములు.ప్రసాంతత వుండదు.కొన్ని పనులు మధ్యలో నిలచిపోవును.స్పెక్యూలేషన్ లాభములు.
ఆగష్టు:- ఈ నెల యందు కూడా సామాన్యంగానే వుండును.చేయు వ్రుత్తి వ్యాపారములు అంతంత మాత్రమే.వ్యవహారములు నష్టం కలిగించును.ఆర్ధిక ఇబ్బందులు.ఇతరుల విషయంలో జోక్యం చేసుకొనుట వలన అవమానం తప్పదు.బందు విరోధం,పోలీసు స్టేషన్ కు వేల్లవలసివచును.స్పెక్యూలేషన్ పరవాలేదనిపించును.
సెప్టెంబర్:- ఈ నెల అన్ని రంగముల వార్కి బాగుండును.ధన నష్టములు,ఇబ్బందులు,ఆరోగ్యరిత్య మార్పులు,శ్రమ భంగం,గాయములు తగులుట,వాహన ప్రమాదములు,వ్యవహార నష్టం,కుటుంబ వ్యక్తులతో తగాదాలు,భార్య భర్త ల మధ్య తగాదాలు,సంతానం తో ఇబ్బందులు,జాగ్రత్తగా వ్యవహరించండి.
అక్టోబర్:- ఈ నెలలో గ్రహములన్ని అనుకూలం గా వున్ననూ కుజుడు ఎనిమిదవ ఇంట ఇబ్బందులు కలుగజేయును.సోదర విరోధములు,భూసంభంద తగాదాలు,వాహన ప్రమాదములు,సంతాన నష్టం,ఊహించని సంఘటన జరుగును.ప్రభుత్వ మూలక ఇబ్బందులు,నమ్మిన వారివలన నష్టం.
నవంబర్:- ఈ నెలలో ప్రధమార్ధం బాగుంటుంది.చేయు వ్రుత్తి వ్యాపారములయందు రాణించును.అన్నింటా జయం,ద్వితియార్ధంలో అంత అనుకూలత వుండదు.ఆదాయమునకు మించిన ఖర్చులు,దుబారాలు చేయుట,కుటుంబ కలహాలు,స్త్రీ విరోధములు,ప్రభుత్వ మూలక నష్టం,స్పెక్యూలేషన్ బాగుండదు.
డిశంబర్:- ఈ నెలలో ఒకటి మరియు పన్నండవ స్థానంలో గ్రహసంచారం వలన అన్నింటా ఇబ్బందులే.అన్నిరంగాముల వారికీ కస్టాలు.దూర ప్రయనములు,గృహ మార్పులు,స్థాన మార్పులు,
ఆదాయమునకు మించిన ఖర్చులు,ప్రభుత్వ మూలక నష్టం,సోదర విరోధములు.
జనవరి:- ఈ నెల జన్మ రాశి యందు గ్రహసంచారం వలన మానసికంగా ఇబ్బందులు.మనశ్సాంతి వుండదు.ఆరోగ్యం కూడా అంతంత మాత్రం.శారీరక ఇబ్బందులు,అకాల భోజనం,కార్యముల యందు ఆటంకం,ప్రతి నిమిషం టెన్షన్ గా వుంటుంది.వాహన ప్రమాదం,బంధుమిత్రులతో విరోధం,స్పెక్యూలేషన్ నష్టం తప్పదు.
ఫిబ్రవరి:- ఈ నెలలో సమస్యలనుండి బయట పడెదరు.చేయు వ్రుత్తి వ్యాపారములయందు రాణించును.ఆదాయం బాగుంటుంది.ఆరోగ్య లాభం,కుటుంబ సౌఖ్యం,బంధుమిత్ర లాభం,యసోభుషణ ప్రాప్తి,వ్యవహార జయం,భార్య భర్తల మధ్య సరైన అవగాహన,గృహం లో శుభములు,స్పెక్యూలేషన్ రాణించును.
మార్చ్:- ఈ నెలలో ఎనిమిదవ ఇంట కుజుడు వున్నప్పటికీ మిగిలిన గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున చేయు వ్రుత్తి వ్యాపారములు అనుకూలించును.ఆరోగ్య లాభం,ధన లాభం,సోదర వృద్ది,ధైర్యముతో కూడిన పనులు చేయుట,వాహన సౌఖ్యం,బంధుమిత్ర సంతోషం,వ్యవహారానుకులత,స్పెక్యూలేషన్ లాభములు.

